ఘనంగా ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు

– ఘనంగా ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు
నవతెలంగాణ – నూతనకల్
మండల పరిధిలోని చిల్పకుంట్ల ప్రాథమికోన్నత పాఠశాలలో ముందస్తుగా దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సింగిల్ విండో చైర్మన్ బాణాల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాలలో రాణించి సమ సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని అన్నారు అనంతరం తన సొంత ఖర్చులతో  ఉపాధ్యాయురాలతో పాటు అంగన్వాడి సిబ్బందిని సాల్వాలతో సన్మానం చేసి పుష్పగుచ్చ ఇచ్చి ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బాణాల సుదర్శన్ రెడ్డి, పెద్దింటి మోహన్ రెడ్డి బాణాల మల్లారెడ్డి కూసు వెంకన్న ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.