ఘనంగా ఉపాధ్యాయుల సన్మానోత్సవం

నవతెలంగాణ- తొర్రూర్ రూరల్

ప్రాథమిక పాఠశాల వెంకటాపురంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సర్పంచ్ లింగన్న గౌడ్ నేతృత్వంలో శాలువా, పూలమాలలతో ఉపాధ్యాయులకు ఘన సన్మానం జరిగింది. అనంతరం మాట్లాడుతూ అజ్ఞానము అనే చీకటిని తొలగిస్తూ విజ్ఞానము అనే వెలుగులు ప్రసాదిస్తూ, భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేస్తూ భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుల సేవలు చాలా గొప్పవి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శీలం లింగన్న గౌడ్, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ బానోత్ కవిత, వైస్ చైర్మన్ గద్దోజు శ్రీనివాసాచారి, గ్రామ కార్యదర్శి చింతల సుమన్, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.