తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన వెంగిలిపువ్వు బతుకమ్మ వేడుకలను మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాలలో బుధవారం ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా మహిళలు రంగురంగుల తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చుకొని వీదుల వెంట ప్రదర్శనగా వెళ్లి ఒకచోట చేర్చి సంస్కృతి సంప్రదాయాలైన పాటలను పాడుతూ కోలాటాలను వేస్తూ బతకమ్మ సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పి ఎ సి ఎస్ చైర్ పర్సన్ నాగం జయసుధ సుధాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు తీగల కరుణశ్రీ గిరిధర్ రెడ్డి, గోరుగంటి ఉషారామకిషన్ రావు మాజీ ఎంపిటిసి పన్నాల రామ మల్లారెడ్డి, చురకంటి జానమ్మ మాజీ ప్రజాప్రతినిధులు పంచాయితీ కార్యదర్శులు మండల ప్రజాపరిషత్ సిబ్బంది గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.