ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ-చౌడాపూర్‌
మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం తహసీల్దార్‌ కార్యాలయంలో తహసిల్దార్‌ ప్రభూలు ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అమరుల త్యాగాలు వెలకట్టలేనిమన్నారు. కార్యక్రమంలో కార్యాలయం సిబ్బంది, అధికారులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, మహిళలు,యువత,తదితరులు పాల్గొన్నారు.