
పట్టణంలోని బైపాస్ రోడ్డులో గల ఆల్ ఫోర్స్ లిటిల్ నేషనల్ పాఠశాలలో గురువారం ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గురువుల ద్వారా సమాజాన్ని ఉత్తమంగా నిర్మించవచ్చని ,వారి సూచనలను అభివృద్ధికి పునాదులు వేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించినటువంటి ఓ గురువు నీకు వందనం… లోకం చెప్తుంది వందనం.. గురు వే దైవం… గురువే బలం అని నృత్యాలు చేయడం అందరిని ఆలోచింప చేశాయి. ఈ వేడుకలలో భాగంగా విద్యార్థుల అభ్యున్నతికై అహర్నిశల కృషి చేస్తున్న ఉపాధ్యాయులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.