ఘనంగా క్రిస్మస్ వేడుకలు..

నవతెలంగాణ-  చివ్వేంల
క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని మండల వ్యాప్తంగా చర్చిలు భక్తులతో కోలాహలంగా మారాయి. క్రైస్తవ మతస్థులు ఉదయం నుంచే భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఏసుక్రీస్తు జన్మదిన వేడుకల సందర్భంగా పాస్టర్‌లు, క్రైస్తవ మతపెద్దలు, బిషప్‌లు క్రీస్తు సందేశాన్ని భక్తులకు అందజేశారు. రంగురంగుల దీపాలతో, నూతన వస్త్రాలతో చిన్నారులు ఆడిపాడి అలరించారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని  ఖాసీం పేట లో బేతెస్థ మందిరంలో బేతెస్థ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు,సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు    బిషప్ దుర్గం ప్రభాకర్ -కరుణ శ్రీ(హెప్సిబా) ఆధ్వర్యంలో వృద్ధులు, వితంతు, పేద క్రైస్తవులకు   దుస్తులు పంపిణీ చేశారు. అదేవిధంగా చివ్వేంల మండల కేంద్రంలోని మన్నా చర్చిలలో పాస్టర్ సామ్యేల్- ఎస్తేరు రాణి  ఆధ్వర్యంలో ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు . సంగీత పరిచర్య బెన్ని, విన్ని ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అనంతరం క్రిస్మస్ కేకును కట్ చేశారు. ఏసుప్రభు జన్మదినాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున భక్తులు చర్చిలకు తరలి వచ్చారు. క్రైస్తవ మతపెద్దలు క్రీస్తు సందేశాన్ని అందజేశారు. క్రీస్తు జననానికి సంబంధించిన వృత్తాంతాన్ని, పశువుల పాక.. క్రిస్మస్ ట్రీలు, చర్చిలో విశేషాలంకరణలతో శోభాయమానంగా అలరించాయి. ప్రభు ఆశీస్సులతో ప్రపంచం సుఖ శాంతులతో ఉండాలని మతపెద్దలు ఆకాంక్షించారు. పలు కార్యక్రమాలలో సీనియర్ న్యాయవాది గుడపురి వెంకటేశ్వర్ రావు ఏ. జి. పి సూర్యాపేట , డా. ఊర రాంమూర్తి యాదవ్,  బిషప్ యం. పి. హెచ్. హెచ్ మోజెస్,పల్లెటి సైమన్ రాజు,వాస సాగర్,యాడవెల్లి యేసుపాదం, మీసాల తీతు, బాబు, ఉపేందర్,సురేష్, కళింగ రెడ్డి, సతీష్, వెంకట్, శేఖర్,    డీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెన్న మధుకర్ రెడ్డి, కొణతం అప్పిరెడ్డి, సమ్మయ్య, నంద్యాల నరేష్ రెడ్డి , వల్దాస్ వెంకన్న ,సీపీఐ మండల కార్యదర్శి ఖమ్మంపాటి రాంబాబు , వేముల చిన్న , వల్దాస్ వీరయ్య ,బోప్పని అనిల్ , లింగం సురేష్ , బొప్పాని సృజన్  తదితర  పాల్గొన్నారు