బట్టాపూర్ తండాలో ఘనంగా శీతల పండగ

A grand cold festival in Battapur Tandaనవతెలంగాణ – ఏర్గట్ల
మండలంలోని బట్టాపూర్ తాండాలో గిరిజనులు మంగళవారం శీతల పండగను ఘనంగా నిర్వహించారు. గిరిజనుల దేవతలైన అమ్మవార్లకు యువతులు,తాండా వాసులు ఊరేగింపుగా వెళ్ళి నైవేద్యం సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని,కుటుంబ సభ్యులు ఆరోగ్యంతో ఉండాలని ఈ పండగను నిర్వహిస్తామని తాండా పెద్దలు అన్నారు. ఈ కార్యక్రమంలో తండావాసులు భూక్యా తిరుపతి నాయక్,భీమ,భాధవత్ శివ,అంజి,భీముడు,జగన్,వెంకట్, శ్రీనివాస్,రమేష్,శ్రీధర్,శివ,నందు,నారాయణ తదితరులు పాల్గొన్నారు.