నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం భూపాలపల్లి జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి, తాడిచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ దేవరాజు ఆధ్వర్యంలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు, ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు పార్టీ నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రిన్స్ పాల్ మాట్లాడారు విద్యార్థులు తమ భవిష్యత్తును చదువుతో చక్కగా తీర్చిదిద్దుకోవాలని చదువు చెప్పిన లెక్చర్లకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని చెడు అలవాట్లకు బానిసలు కాకూడదని వచ్చే వార్షిక పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించాలని కోరారు కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చినటువంటి మలహర్ మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు చింతల మలహల్రావు మాట్లాడుతూ విద్యార్థులకు ఇంటర్మీడియట్ దశ ముఖ్యమైనదని ఈ దశలో మంచిని గ్రహించి చెడును త్యజించి టీవీ , సెల్ ఫోన్ లకు బానిసలు కాకూడదని ,బాగా చదివి తల్లిదండ్రులకు, చదువు చెప్పిన గురువులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.అనంతరం అతిధులకు సన్మాన కార్యక్రమం నిర్వహించి, ఆటలు పోటీల్లో గెలిచినటువంటి విద్యార్థులకు అతిథులు అధ్యాపకుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు.సాంస్కృతి కార్యక్రమాల్లో విద్యార్థుల నాట్యాలు చూపరులను ఎంతగానో ఆకర్షించాయి ఈ కార్యక్రమంలో ఎంపిటిసి రావుల కల్పన మొగిలి,ప్రదనోపాధ్యాయులు మల్కా భాస్కర్ రావు,తిరుపతి, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.