నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్ గ్రామంలో గల త్రి లింగ రామేశ్వర ఆలయం వద్ద శనివారం ఎడ్లబండ్ల ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రి ని పురస్కరించుకుని త్రి లింగ రామేశ్వర ఆలయం ఆవరణలో ఎడ్ల బండ్ల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు దత్తు తెలిపారు. ఆలయం వద్దకు నాగిరెడ్డిపేట మండల ప్రజలు చేరుకొని ఎడ్లబండ్ల ప్రదర్శనలో పాల్గొన్నారు.