డీఈవో ఆఫీస్‌లో ఘనంగా ఈద్‌ మిలాప్‌

– హాజరైన ముజీబ్‌, ఆర్జేడీ, ఇన్‌చార్జి డీఈవో
నవతెలంగాణ-సిటీబ్యూరో
విద్యాశాఖ కార్యాలయంలో మంగళవారం ఈద్‌ మిలాప్‌ కార్యక్రమం ఘనంగా జరిగింది. టీఎన్జీవోస్‌ యూనియన్‌ స్కూల్‌ ఎడ్యూకేషన్‌ డిపార్టుమెంట్‌ యూనిట్‌ అధ్యక్షుడు కె.ఆర్‌. రాజ్‌ కుమార్‌, సెక్రటరీ ఎం.భాస్కర్‌ వారి కార్యవర్గం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఎన్జీవోస్‌ యూనియన్‌ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఎస్‌.ఎం. హుస్సేని(ముజీబ్‌), ఆర్జేడీఎస్‌ఈ హైదరా బాద్‌ ఈ. విజయలక్ష్మి, ఇన్‌చార్జి డీఈవో బి.శ్రీనివాస్‌ రెడ్డి, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి విక్రమ్‌ హాజర య్యారు. ఈ సందర్భంగా వారికి బోకే అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ పండుగలు మత సామరస్యానికి ప్రతీకలని, విద్యాశాఖ ఉద్యోగులు అన్ని మతాల పండుగలను కలిసికట్టుగా నిర్వహించు కోవడం అభినంద నీయమన్నారు. ఉద్యోగులకు సంబం ధించిన సమస్యలు త్వరలోనే పరిష్కారమవు తాయని డాక్టర్‌ ముజీబ్‌ చెప్పారు. ఈ కార్యక్ర మంలో కోశాధికారి ఎస్‌డీ ప్రేమ్‌ కుమార్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ నరేష్‌, జాయింట్‌ సెక్రటరీ ఎం.ఏ ముజీబ్‌, ఖలీద్‌ అహ్మద్‌, ప్రచార కార్యదర్శి వైదిక్‌ శాస్త్ర, ఈసీ శంకర్‌, పీఆర్వో జహంగీర్‌, ఏపీఆర్వో వహీద్‌, స్కూల్‌ ఎడ్యూకేషన్‌ యూనిట్‌ ఉపాధ్యక్షులు బి.రవికుమార్‌, రుగేష్‌, సంయుక్త కార్యదర్శులు ఎం.ఎ.ముక్తాదర్‌, జయంతి, ఆర్గ్‌.సె. ఫిరోజ్‌ అహ్మద్‌, ఈసీ ముజాహిద్‌ అలీ, ప్రియదేవ్‌ ఠాకూర్‌, ఫోరం కార్యదర్శి చారి, మహ్మద్‌, ప్రాథమిక సభ్యులు అఖిల్‌, సూర్య, మీర్జా, రమేష్‌, అరుణ, లావణ్య, సి.రాజశేఖర్‌, కె.పి. అనురాధ, జీవన్‌, మల్లికార్జున్‌, జి.రాజ్‌కుమార్‌, విజయలక్ష్మి, సయ్యద్‌ ఫరూఖ్‌ అలీ, చక్రవర్తి, సరళాదేవి, ప్రవీణ, సుగుణారెడ్డి, డి.శ్రీకాంత్‌, శశిరత్న, హేమావతి తదితరులు పాల్గొన్నారు.