నవతెలంగాణ-తాండూరు
తాండూరు పట్టణ కేంద్రంలోని ఆదర్శనగర్‌లో గల శ్రీ చైతన్య పాఠశాలలో స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాలో భాగంగా ఫ్యామిలీ ఫెస్ట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కుటుంబ సభ్యుల ప్రాధాన్యతను వివరించి కుటుంబ పెద్దలైన తాతయ్య అమ్మమ్మలు, అమ్మ నాన్నలకు పాదపూజ చేసి బహుమతులు అందజేశారు. కుటుంబ విలువలు దూరమవుతున్న నేటి తరుణంలో శ్రీచైతన్య స్కూల్‌లో స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం ద్వారా ఫ్యామిలీ ఫెస్ట్‌ను నిర్వహించారు. తద్వారా విద్యార్థులు తమ తమ తల్లిదండ్రులకు పాదపూజా కార్యక్రమాన్ని నిర్వహించి అత్యంత ప్రేమతో తల్లిదండ్రులకు బహుమతులు అందించి ప్రేమను చాటుకున్నారు. అనంతరం తల్లిదండ్రులను పాటలతో, నృత్యాలతో అలరించారు. అనంతరం వ్యాసరచన, అకాడమిక్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రత్యేక అతిథిగా వచ్చిన తైక్వాండో మాస్టర్ మనోహర్ మరియు తల్లిదండ్రుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులకు విద్యార్థులకు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పాఠశాల చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, ఏజీఎం వెంకట్, స్టేట్ అకాడమిక్ కోఆర్డినేటర్ సురేష్, జోనల్ కోఆర్డినేటర్ వీరస్వామిలు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో డీన్ శివరాంరెడ్డి, సి బ్యాచ్ ఇన్‌చార్జి అనన్య, ప్రైమరీ, ప్రీ ప్రైమరీ ఇన్‌చార్జులు సుమేరా, అనిత, విజరు కుమార్, షబ్బీర్, సంజీవ్, జనార్ధన్, శివశంకర్, విజరు తదితరులు పాల్గొన్నారు.