సర్పంచ్ లకు ఘనంగా వీడ్కోలు సన్మానం

నవతెలంగాణ -మల్హర్ రావు
సర్పంచ్ ల పదవీకాలం నేటితో మునియనున్న నేపథ్యంలో మండలంలోని ఆన్ సాన్ పల్లి,కొండంపేట,కొయ్యుర్ సర్పంచ్ లు గుగులోత్ జగన్ నాయక్, అడ్డురి కుమార స్వామి, సిద్ది లింగమూర్తి లకు గురువారం  గ్రామపంచాయతీల కార్యాలయాల్లో ఘనంగా వీడ్కోలు పలికి పూలమాల, శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, జెడ్పిటిసి కోమల, మాజీ ఎంపిపి దూలం సులోచన, ఉప సర్పంచ్ స్వప్న, యాదవ సంఘం హడక్ కమిటీ నాయకులు, యాదoడ్ల రామన్న యాదవ్, బోయిని రాజయ్య యాదవ్, కోడారి చిన్న మల్లయ్య యాదవ్, యాదoడ్ల గట్టయ్య, రవి శంకర్ యాదవ్ పాల్గొన్నారు.