ఘనంగా ఎంపీటీసీలకు వీడ్కోలు..

నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో నల్ల శ్రీవాణి ఆధ్వర్యంలో ఎంపీటీసీలకు వీడ్కోలు సమావేశం సోమవారం నిర్వహించి ఎంపీటీసీలను ఘనంగా శాలువాలతో సన్మానించారు.ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, నిస్వార్ధంగా ప్రజాసేవలు చేసిన నాయకులను ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూస్తారని ఆయన అన్నారు.అనంతరం మాజీ జెడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధి విషయంలో రాజకీయాలకు చోటు లేకుండా సమన్వయంతో ముందుకు సాగితే అప్పుడే గ్రామాలకు ఆశించిన విధంగా అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఉమ్మెత్తల సరోజన,  వైస్ ఎంపీపీ పులికోట రమేష్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పెద్ది శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు గాండ్ల  తిరుపతి,జంగిలి సంపత్, మోతే భాగ్యలక్ష్మి,మాతంగి లక్ష్మి,కొయ్యడ శోభారాణి, బొజ్జ కవిత, ఏనుగల అనిల్,ఎస్కే మోహిన్,ఎంపీ ఓ  బషీరుద్దీన్, ఏపీవో శారధ ఆర్ఎస్ డబ్ల్యూ మొగిలి, కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.