మార్కెట్ యార్డ్ లో ఘనంగా రైతు పండుగ..

A grand farmer's festival in the market yard..– రూ.2 లక్షల రుణమాఫీ,రూ.500 బోనస్ పై రైతుల హర్షం..
నవతెలంగాణ – బెజ్జంకి
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి సర్కారు అమలు చేస్తుండడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పెరిగిందని మార్కెట్ కమిటీ చైర్మన్ పులి క్రిష్ణ సంతోషం వ్యక్తం చేశారు. శనివారం మండలంలోని ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  వరి కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్మన్ క్రిష్ణ పరిశీలించి రైతులతో మాట్లాడారు. మార్కెట్ యార్డులో రైతు పండుగ సంబరాలు జరుపుకోవడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రి పొన్నం ప్రభాకర్,ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,పులి సంతోష్,బోనాల మల్లేశం,పుల్ల పోచయ్య,మచ్చ కుమార్ తదితరులు ఉన్నారు.