ఆర్టీసీ ప్రయాణికులకు గ్రాండ్‌ ఫెస్టివల్‌ చాలెంజ్‌

– టికెట్‌పై బహుమతులు అందుకునే అవకాశం
– ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్‌ అశోక్‌ రాజు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
దసరా సందర్భంగా ఆర్టీసీ ప్రయాణికులకు సంస్థ గ్రాండ్‌ ఫెస్టివల్‌ చాలెంజ్‌ను ఏర్పాటు చేసిందని ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్‌ అశోక్‌ బాబు తెలిపారు ఈ అవకాశాన్ని ప్రతి ప్రయాణికుడు ఉపయోగించుకోవాలని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు తగు సూచనలు చేసే చేస్తూ మాట్లాడారు. 100 రోజుల ఆర్టీసీ గ్రాండ్‌ ఫెస్టివల్‌ చాలెంజ్‌ను ఏర్పాటు చేసిందన్నారు. అక్టోబర్‌ 15వ తేదీ నుంచి వచ్చే సంవత్సరం జనవరి 22వ తేదీ వరకు ఈ ఫెస్టివల్‌ను ఉపయోగించుకోవచ్చని చెప్పారు. ఈ నెల18 నుండి 30 వరకు ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిందన్నారు. ఆర్టీసి బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు తాము తీసుకున్న టిక్కెట్టును ఆయా డిపోల్లో ఏర్పాటు చేసిన బాక్సుల్లో తమ పేరు ఫోన్‌ నెంబర్‌ రాశి బాక్సులు వేయాలని గుర్తు చేశారు. రీజియన్‌ పరిధిలో ఆయా టికెట్లను బాక్సుల్లో వేసిన టికెట్లపై లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పారు. ఉద్యోగులు అందరూ అభినహితో కబీ నహి” బస్‌ బరో అనే నినాదంతో డిపోకి అధిక ఈపీకే తీసుకురావాలని ఉద్యోగులకు సూచించారు. అదేవిధంగా ప్రస్తుతం ఆర్టీసీ నూతన కార్యక్రమాలతో ప్రయాణికులను ఆకర్షిస్తుందని తెలిపారు. ఉద్యోగులందరూ ఈ నెల 15 నుండి జనవరి 22 వరకు 100 రోజులపాటు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులు నడుపుతూ అత్యధిక ఆదాయం పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దసరా పండుగ పురస్కరించుకొని ఈ నెల18 నుండి 30 వరకు ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే ప్రయాణికులకు రీజియన్‌ ఐదుగురు చొప్పున మహిళలు, పురుషులను ఎంపిక చేసి ఒక్కొక్కరికి రూ 9,900ల నగదు బహుమతి అందించనున్నామన్నారు. ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంత ప్రయాణికులు ఆర్టీసీ బస్సులు ప్రయాణించి టికెట్పై మీ పేరు మీ చిరునామా మీ ఫోన్‌ నెంబర్‌ రాసి బస్టాండ్‌లో గల డ్రాప్‌ బాక్స్‌లో వేయాలన్నారు.