
మద్నూర్ మండల కేంద్రంలో ఆదివారం నాడు ఊరదేవతలకు ఘనంగా బోనాల పండుగ గ్రామ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు ఆదివారం నాడు కులబేడల వారీగా ఈ బోనాల పండుగ గ్రామ ప్రజలు గ్రామ దేవతలకు నైవేద్యాలు సమర్పించి ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా మున్నూరు కాపు కులస్తులు అదే విధంగా పద్మశాలి కులస్తులు చాకలి కులస్తులు బేడల వారిగా బోనాలు నైవేద్యాలు సమర్పించారు. ఈ బోనాల పండుగ గత మంగళవారం నుండి ప్రారంభం అయ్యాయి చివరిగా వచ్చే మంగళ వారం నాటికి బోనాల పండుగ సమయం ముగుస్తుందని గ్రామస్తులు తెలిపారు.