
మండలంలోని వడ్లం గ్రామంలో శనివారం రోజున ముత్యాల పోచమ్మ బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. గత సంవత్సరం ముత్యాల పోచమ్మ గుడి నిర్మించి విగ్రహ ప్రతిష్టాపన చేసి బోనాల పండుగను జరిపారు. శనివారం నాటికి ఒక సంవత్సరం పురస్కరించుకొని యధావిధిగా రెండవసారి జరుపుకున్నారు. ముత్యాల పోచమ్మ గ్రామ దేవత కావడం వలన తల్లి యొక్క చల్లని దీవెనలు గ్రామ ప్రజలపై ఉండాలని, పాడిపంటలు సుశ్శ్యామలంగా ఉండాలని గ్రామ ప్రజలకు ఎటువంటి కష్టాలు రాకుండా చూడాలని గ్రామ ప్రజలంతా బ్రహ్మ ముహూర్త సమయంలో లేచి ఊరంతా శుద్ధి చేసుకుని గడపగడప నుండి బోనాలతో డప్పుల చప్పుడుతో ఊరంతా తిరిగి నైవిద్యాలతో అమ్మవారిని పూజించి, గ్రామ ప్రజలంతా కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహించుకుని అందరు కూడా అమ్మవారి సన్నిధానంలో భోజనాలు చేశారు.