
బంజారాల అరాధ్య దైవం సీత్లా పండుగను మండలంలోని వివిధ గిరిజన తండాల్లో మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గిరిజనులు ఆరాధ్య దైవంగా భావించే సిత్లా అమ్మవార్లకు గిరిజన మహిళలు ప్రత్యేకంగా వండిన పులగం, ఎండు మిరపకాయలు, గడ్డలు, జొన్న గుగ్గిళ్ళను అమ్మవారికి చెల్లించి మొక్కులు తీసుకున్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి తమ పాడి, పంట పొలాలు బాగా పండి తమ ఇంట సిరులు కురియాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు గుగులోతు నర్సింగ్ నాయక్, మూడ్ రవీందర్ నాయక్,సురేందర్, అప్పా నాయక్, శంకర్ నాయక్, కృష్ణ నాయక్, వస్త్రం, మూడు శంకర్, జలంధ నాయక్, వీరన్న నాయక్, పాతులోతు నాగు నాయక్, శ్రీను నాయక్, గుగులోతు రమేష్ నాయక్, లింగా నాయక్ తోపాటు గిరిజన మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.