
పట్టణ పరిధిలోని గల మామిడిపల్లి గ్రామంలో శివాజీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలను గత 5 సంవత్సరాల నుండి ఘనంగా నిర్వహిస్తున్నారు.ప్రతి ఏటా గణేష్ ఉత్సవాలను కనుల పండుగగా జరుపుకుంటూ భారీ వినాయక విగ్రహాని ప్రతిష్టించి ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అక్కడికి వచ్చిన భక్తులకు ప్రసాదాలను అందజేస్తున్నారు.రాత్రి వేళల్లో భజన కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహిస్తున్నారు. శుక్రవారం శివాజీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ అన్నదాన కార్యక్రమానికి మహిళలు,యువకులు గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం శివాజీ యూత్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమానికి మాకు సహకరించిన సునీల్ గౌడ్ కు శాలువా తో ఘనంగా సన్మానించడం జరిగింది. అదేవిధంగా మాకు చందల ద్వారా గాని వస్తువుల ద్వారా గాని మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివాజీ యూత్ క్లబ్ సభ్యులు హర్షవర్ధన్, తేజ, రాహుల్ అభిరాం, సిద్దు, శ్రావణ్ మోహన్, వరుణ్, సజై అజయ్, రవి, మనీ తదితరులు పాల్గొన్నారు.