
మండల కేంద్ర శివారులోని శ్రీ విద్యాసాయి ఉన్నత పాఠశాలలో ప్రతిష్టించిన వినాయకుని నిమజ్జన శోభాయాత్ర సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు ఘనంగా భక్తిశ్రద్ధలతో పూజించి మండల ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించి అనంతరం చెరువులో నిమజ్జనం చేశారు. ఈ శోభయాత్రలో భాగంగా విద్యార్థులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి భక్తి గీతాలు నృత్యాలు చేయడం అందరినీ విశేషంగా అలరించాయి.