నవతెలంగాణ-సిటీబ్యూరో
సికింద్రాబాద్‌లోని శ్రీ స్వామినారాయణ గురుకుల అంతర్జాతీయ పాఠశాలలో మొదటి బ్యాచ్ ఎల్‌కేజీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ డే జరుపుకున్నారు. భగవా న్ స్వామినారాయణుని దీవెనతో, పూజ్య సుఖవల్ల భదాస్ స్వామీజీ ఆశిస్సు లతో విద్యార్థులు ఈ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలందరికీ స్వామీజీయూకేజీ కంప్లీషన్ సర్టిఫికెట్లను అందించి ఆశీర్వదించారు. విద్యార్థులు ఆధ్యాత్మిక గీతాలు, ఇతర సాంస్కతిక కార్యక్రమాలు వంటి పలు కార్యక్రమాలను ప్రదర్శించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం స్వామీజీ సందేశం ఇచ్చారు. స్కూల్ డైరెక్టర్, ప్రిన్సిపాల్, ప్రైమరీ కో-ఆర్డినేటర్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులందరికీ సందేశం ఇచ్చారు. పూజ్య హరి వల్లభ స్వామీజీ పిల్లలను ఆశీర్వదించారు.