
భిక్నూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం హిందీ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల కాలంలో అనారోగ్యం కారణంగా మరణించిన పాఠశాల హిందీ ఉపాధ్యాయులు ఉదయ్ దత్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు శ్రీనాథ్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో మరణించిన హిందీ ఉపాధ్యాయులు ఉదయ్ దత్ గతంలో తన ఖర్చుతో హిందీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించే వారని అట్టి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ పాఠశాలలో హిందీ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించి హిందీ భాష గొప్పతనం గురించి విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు, వ్యాసరచన, ఉపన్యాస, డాన్స్ పోటీలు నిర్వహించి పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.