ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా హిందీ దివస్

నవతెలంగాణ-భిక్కనూర్
భిక్నూర్‌ మండలంలోని జంగంపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం హిందీ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింబాద్రి  మాట్లాడుతూ హిందీ భాష గొప్పతనం వివరిస్తూ, హిందీ భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి పై ఉందన్నారు. అలాగే పాఠశాల ఉపాధ్యాయులు గఫూర్ శిక్షక్  రూపొందించిన హిందీ భాషా ప్రాముఖ్యతను తెలియజేసే నినాదాల కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులు హిందీ భాషా ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఉపన్యాసాలు, పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు.