
రంజాన్ మాసం సందర్భంగా యాదగిరిగుట్ట మండలం మల్లాపురం బుధవారం, ఎంపీటీసీ కర్రే విజయ వీరయ్య ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా కర్రే వీరయ్య మాట్లాడుతూ ముస్లింలకు రంజాన్ పవిత్రమైన మాసమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వహయాంలో ముస్లిం సోదరులకు అన్ని విధాల న్యాయం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు అలీముద్దీన్, జహంగీర్, అక్బర్, కర్రె పెద్దోళ్ళ ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.