
జక్రాన్ పల్లి మండలం కొలిప్యాక్ గ్రామంలో అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం రోజున పెద్ద పోచమ్మ తల్లి గంగానీళ్ళు బోనాలు ఘనంగా డప్పు చప్పులతో ఊరేగింపుగా నిర్వహించారు. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు..ఈ ఏడాది కూడా వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో వీడిసి చైర్మన్ ఇంద్ర గౌడ్, సాగర్, గొల్ల మొత్తెన్న, మాజీ ఎంపీపీ డికొండ హరిత శ్రీనివాస్, గ్రామ మాజీ సర్పంచ్ ఆత్మకూరు గంగుబాలయ్య, గ్రామ బీ.ఆర్.ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్ తెలంగాణ జాగృతి అధ్యక్షులు అజయ్ మరియు అన్ని కుల సంఘాల పెద్దలు గ్రామస్థులు మహిళలు, తదితరులు పాల్గొన్నారు.