– వర్చువల్ మేళా ద్వారా సంబరాలలో పాల్గొనండి
- రూ. 199/- లో 50 లక్షలకు పైగా విస్తృత శ్రేణి ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి
- ప్రతిరోజూ వినియోగదారులు పరిమిత స్టాక్ లావాదేవీల నుండి రూ. 1కే ఉత్పత్తులను పొందవచ్చు
- 100 మంది వినియోగదారుల వరకూ ఒక లక్ష రూపాయల విలువైన గ్రాండ్ ప్రైజ్ గెలుచుకునే అవకాశం కూడా ఉంది.
- మేళా-నేపథ్యంగల TVC మరియు పూర్తిగా లీనమయ్యే యాప్ అనుభవాన్ని పురస్కరించుకుని, Shopsy వినోదం యొక్క సరదా మరియు ఉత్సాహలతో పండుగ వాతావరణాన్నిమరింత పెంపొందించాలని ఆశిస్తుంది
బెంగళూరు – ఆగస్టు 31, 2024: భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నమరియు అత్యంత విలువైన ప్లాట్ ఫారమ్ ఫ్లిప్ కార్ట్ షాపింగ్ వాతావరణాన్ని గ్రాండ్ Shopsy మేళాగా ప్రారంభిస్తూ పండుగ సంబరాలకు సన్నద్ధమవుతోంది. సెప్టెంబర్ 1 నుండి 8 వరకునడిచే ఈ అమ్మకం, సాంప్రదాయ భారతీయ వేడుకల సారాన్ని సంగ్రహించి, అసమానమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తూ, Shopsy ప్లాట్ ఫారాన్ని శక్తివంతమైన వర్చువల్ మేళాగా మారుస్తుంది.
నాణ్యత, వైవిధ్యాలపై దృష్టి సారించిన గ్రాండ్ Shopsy మేళా ఈ సంవత్సరంలో అతిపెద్ద షాపింగ్ వేడుకలలో ఒకటిగా అవతరిస్తుందని, వినియోగదారులకు పండుగ సీజన్ కోసం అవసరమైన ప్రతీ వస్తువును సరసమైన ధరలకు అందించే వీలు కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి అందిస్తూ రూ. 199/- లోపు 50 లక్షల ఉత్పత్తుల యొక్క విస్తృతమైన ఎంపిక ఉంటుంది. ఈ సంవత్సరం, Shopsy ఫ్యాషన్, బ్యూటీ, హోమ్, మొబైల్స్ మరియు లార్జ్ ఎలక్ట్రానిక్స్ లలో 150 కేటగిరీలకు తన ఆఫర్లను విస్తరిస్తోంది, ఇది గత సంవత్సరపు 60 కంటే రెట్టింపు అధికం. పండుగ సమయంలో కుటుంబాల యొక్క విభిన్న అవసరాలను తీర్చడానికి మరియు కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఉత్తమమైన విలువ మరియు శ్రేణిని అందించడానికి Shopsy యొక్క నిబద్ధతను ఈ విస్తరణ ప్రతిబింబిస్తుంది. సాంప్రదాయ మేళాలలో, ముఖ్యంగా టైర్ 2 నగరాల్లో మరియు వెలుపల వారి ఉత్సాహం మరియు ఆసక్తులను అర్థం చేసుకుంటూ, Shopsy ఈ డిజిటల్ ఫెయిర్ ను ఆలోచనాత్మకంగా నిర్వహిస్తోంది, సరికొత్త, పండుగ ఎంపికలు మరియు అద్భుతమైన డీల్ లతో కూడిన ప్రత్యేకమైన మరియు ఆకర్షణీయమైన షాపింగ్ అనుభవాన్ని వినియోగదారులకు అందిస్తోంది.
ఈ సంవత్సరం అతిపెద్ద అమ్మకం గురించి Shopsy బిజినెస్ హెడ్ ప్రత్యూషా అగర్వాల్ మాట్లాడుతూ,“గ్రాండ్ Shopsy మేళా గతంలో కంటే పెద్దదిగా, ఇంకాస్త మెరుగ్గ వన్ స్టాప్ మేళాగా ిరిగి వస్తోంది. పండుగ సీజన్ కోసం సిద్ధం కావాల్సిన అన్ని వర్గాల భారత్ ఇ-షాపర్లకు విలువైన ఉత్పత్తులను అందిస్తోంది. ఈ సారి ఇది కేవలం ఒక షాపింగ్ కార్యక్రమమే కాదు; ఇది భారత్ యొక్క అతి పెద్ద మేళా – ఈ గ్రాండ్ Shopsy మేళా ; ఇది సాంప్రదాయ భారతీయ మేళా యొక్క సారాంశాన్ని ప్రతి లోగిలి యొక్క హృదయంలోకి తీసుకువచ్చే ఒక శక్తివంతమైన వేడుక. కుటుంబంలోని ప్రతి ఒక్కరి కోసం, పండుగ నిత్యావసరాల నుండి రోజువారీ డీల్ ల వరకు, గ్రాండ్ Shopsy మేళా మా వినియోగదారులకు వారి వాలెట్ పరిమితిలో గరిష్ట పరిమాణంలో పండుగ సమృద్ధిని అందించడానికి ప్రయత్నిస్తుంది. వర్చువల్ ప్రపంచంలో మా వినియోగదారులకు ఈ ఉత్సవ షాపింగ్ అనుభవాన్ని అందించడానికి మేము సంతోషిస్తున్నాము, వైవిధ్యం, నాణ్యత మరియు సరసమైన ధరలను ప్రధాన అంశంగా ఉంచుతాము.”
మేళా-ప్రేమికులకు ఒక లీనమయ్యే అనుభవం
అసాధారణమైన ఆఫర్ లకు మించి, Shopsy తన యాప్ మరియు వెబ్ సైట్ లో గంటలవారీ డీల్ లు, ‘ట్రెజర్ హంట్ ’, ‘అంచనా వేయండి మరియు గెలవండి ’, ’ఝట్ పట్ డీల్ లు’, ’లూట్ అవర్స్’ మరియు ఉత్తేజకరమైన పోటీలతో సహా ఆకర్షణీయమైన కార్యకలాపాలను అందిస్తుంది. ‘అంచనా వేయండి గెలుచుకోండి గేమ్ ‘ సమయంలో 500 + లక్కీ విజేతలు ఉచిత ఉత్పత్తులను గెలుచుకుంటారు మరియు 100 లక్కీ విజేతలు 1 లక్ష విలువైన గ్రాండ్ బహుమతులను గెలుచుకుంటారు. Shopsy యాప్ మెరుగైన చెల్లింపు అనుభవంతో, షాపింగ్ ప్రయాణంలో మేళా అంశాలను పొందుపరచడంతో పాటు సున్నితమైన అనుభవాన్ని అందిస్తుంది.
తిరుగులేని ఆఫర్ లు
మునుపెన్నడూ లేని విధంగా ఉత్పత్తుల విస్తృత ఎంపిక మరియు ఆకర్షణీయమైన ధరలతో, గ్రాండ్ Shopsy మేళా భారతదేశం అంతటా వస్తువులు వాటి విలువ ఆధారంగా చూసే వినియోగదారులకు అనువైన షాపింగ్ కార్యక్రమంగా ప్రసిద్ధి చెందనుంది. ఝట్ పట్ డీల్ లు వంటి పరిమిత కాల డీల్ లు తక్కువ లో తక్కువగా రూ .1/- నుండి ప్రారంభమవుతాయి మరియు పరిమిత సమయం వరకు రోజుకు రెండుసార్లు లైవ్ లో ఉంటాయి. ఇతర డీల్ లలో లెర్నింగ్ ట్యాబ్ లు, సీసాలు, ఛాపర్ లు మరియు పోస్టర్ లు రూ. 19/- నుండి, పాశ్చాత్య మరియు సాంప్రదాయ చెవిపోగులు రూ. 25/-నుండి, జ్యువెలరీ సెట్లు రూ. 79/-నుండి, నెక్ బ్యాండ్ లు రూ. 119/-నుండి ప్రారంభం అవుతాయి. ఫ్యాషన్ (జాతి దుస్తులు), ఎలక్ట్రానిక్స్ మరియు మొబైల్సు మరియు గృహ అవసరాలు ఈ సీజన్ లో అగ్ర స్థాయి ంపికలలో ఉన్నాయని Shopsy పరిశోధన సూచిస్తుంది. ప్లాట్ ఫారముకు కొత్తగా వచ్చిన వినియోగదారుల కోసం ఆఫర్ లు ఉంటాయి.
అమ్మకందారులకు బలాన్ని ఇస్తూ
పండుగ సీజన్ డిమాండ్ కోసం అమ్మకందారుల విశ్వాసానికి మరియు సంసిద్ధతకు Shopsy భరోసా ఇస్తుంది. సాధారణంగా, అమ్మకందారులు ఈ సమయంలో అమ్మకాలలో భారీ వృద్ధిని చూస్తున్నందున, బలమైన సరఫరా శ్రేణి మద్దతుతో తగినంత జాబితాను కలిగి ఉండటం వారికి తప్పనిసరి. Shopsy దేశంలోని ప్రతి మూలలో విక్రేత ఈవెంట్ లను నిర్వహిస్తోంది, వినియోగదారులకు నాణ్యత మరియు విలువను అందించడంపై దృష్టి సారించి, పండుగ సీజన్ కోసం విక్రేతలను సిద్ధం చేయడానికి మరియు ఊతం ఇవ్వడానికి క్రమంగా వర్క్ షాప్ లను నిర్వహిస్తోంది. అమ్మకందారులపై కఠినమైన ప్రమాణాలను అమలు చేయడం, ఖచ్చితత్వం కోసం ఉత్పత్తి జాబితాలను ధృవీకరించడం మరియు కస్టమర్ ఫీడ్ బ్యాక్ ను దాని నాణ్యత హామీ ప్రక్రియలలో ఏకీకృతం చేయడం ద్వారా, ప్రతి కొనుగోలు యొక్క విలువ మరియు నాణ్యత పట్ల దాని నిబద్ధతను ప్రతిబింబిస్తుందని నిర్ధారించడానికి Shopsy ప్లాట్ ఫారములో గణనీయమైన పురోగతి సాధించింది. భారతదేశం అంతటా తమ ఉనికిని పెంచుకోవాలని చూసే అమ్మకందారులకు Shopsy మార్కెట్ ప్లేస్ మోడల్ వల్ల భారీ ప్రయోజనం.
సారా అలీ ఖాన్ తో పండుగలు జరుపుకోవడం
ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, Shopsy సారా అలీ ఖాన్ తో వాణిజ్య ప్రకటనను ప్రారంభించింది, ఈ ప్రకటనలో మేళా సెట్టింగ్ లో ఆమె Shopsy నుండి ఫ్యాషన్ బ్యాగ్ ల నుండి అధునాతన సన్ గ్లాసెస్ వరకు ఉత్తమమైన డీల్ లను ఎంచుకుంటూ కనిపిస్తుంది. ఇక్కడ ప్రచారాన్ని చూడండి మరియు Shopsy యాప్ లో తిరుగులేని డీల్ లను కనుగొనడానికి, ఇప్పుడే యాప్ ను డౌన్ లోడ్చేసుకోండి!