వీబీ ఎంటర్టైన్మెంట్స్ తరఫున 2023-2024 సంవత్సరాలకు గాను బుల్లి తెర అవార్డులను విష్ణు బొప్పన ప్రదానం చేశారు. హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించిన ఈ వేడుకలో సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కి సమర్పకులు, వర్చ్యుసా లైఫ్ స్పేసెస్ వైగండ్ల వెంకటేశ్వర్లు , వీవీకే హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ విజరు కుమార్, ఐశ్వర్య సిల్క్స్ లక్ష్మి, అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారితోపాటు దర్శకులు ఎస్.వి. కష్ణారెడ్డి, నిర్మాతలు కె.అచ్చిరెడ్డి, అంబికా కష్ణ, జేడీ లక్ష్మి నారాయణ, హీరో పూరి ఆకాష్, హీరోయిన్ అర్చన తదితరులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో సీనియర్ నటి శ్రీలక్ష్మికి జీవన సాఫల్య పురస్కారం అందించారు. అలాగే టీవీ ఆర్టిస్ట్స్‌కి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌కి, యూట్యూబర్స్‌కి కూడా అవార్డులను ప్రదానం చేశారు. అంతే కాకుండా పది మంది పేద కళాకారులకి ఆర్ధిక సాయం కూడా అందించారు.
శ్రీలక్ష్మి మాట్లాడుతూ, ‘వీబీ ఎంటర్టైన్మెంట్స్ వారికి నా ధన్యవాదాలు. నన్ను గుర్తించి, నాకు ఈ అవార్డుని అందించారు. ఈ సందర్భంగా మా గురువు జంధ్యాలకి థ్యాంక్స్ చెెప్పుకోవాలి. అలాగే నేను పని చేసిన డైరెక్టర్స్, నిర్మాతలు, నటీనటులందరికీ, నా మీద ఎప్పటికప్పుడు విశేష ఆదరణ చూపిస్తున్న ప్రేక్షకులందరికీ నా కతజ్ఞతలు’ అని తెలిపారు.