నవతెలంగాణ-దోమ
మండల పరిధిలోని ప్రాథమిక పాఠశాల బ్రాహ్మణపల్లి గ్రామంలో బదిలీ వీడ్కోలు, స్వాగత సన్మాన కార్యక్రమం గ్రామస్తులు నిర్వహించడం జరిగింది. బదిలీ వీడ్కోలు ఉపాధ్యాయురాలు సంతోష గత 6 సంవత్సరాల నుంచి బ్రాహ్మణపల్లి గ్రామంలో బోధించారు. ఇక్కడ పిల్లలు గాని గ్రామస్తులు గాని ఆమె వెళుతున్న సందర్భంగా చాలా బాధపడ్డారు. అదేవిధంగా నూతనంగా ప్రధానోపాధ్యాయులు వెంకటరెడ్డి, రఘువీర్‌కి స్వాగతం పలుకుతూ వారిని సన్మానించారు. స్కూల్ మాజీ చైర్మెన్ రవి, వ్యవసాయ కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి పి.రఘురాం మాట్లాడుతూ ఉపాధ్యాయురాలు సంతోష చాలా కాలంగా మా గ్రామంలో ఉండి పిల్లలకు గానీ గ్రామస్తులతో అందరితో చాలా చక్కగా ఉంటూ పిల్లల పేరెంట్స్ తో నచ్చజెప్పి పిల్లల్ని స్కూల్‌కి తెప్పించే ప్రయత్నం చాలా చేశారు. అదేవిధంగా ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు వెంకట్‌రెడ్డి, రఘువీర్‌అదేవిధంగా పిల్లలని చక్కగా చదువుతోపాటు క్రమశిక్షణ ఆటపాటలతో నడిపించాలని కోరారు. కార్యక్రమంలో పెద్ద తండా హెచ్‌ఎం గోపాల్, రేణుక, అంగన్‌వాడీ టీచర్ లక్ష్మి, ఆయా మహేశ్వరి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.