
డిచ్ పల్లి,ఇందల్ వాయి మండల కేంద్రలతో పాటు ఆయా గ్రామాలలో ఘనంగా పోచమ్మ పండగ,ఊరు పండగ ను ఆదివారం ఘనంగా నిర్వహించారు.గత 70 ఏళ్ల నుండి ధర్మారం గ్రామ ప్రజలు ఘనంగా పోచమ్మ పండగను నిర్వహిస్తున్నమని, ఆషాడ మాసం మొదటి ఆదివారం మొదలుకొని చివరి ఆదివారం నాడు మహాలక్ష్మి ఆలయం నుండి పోచమ్మ ఆలయం వద్దకు ఊరేగింపుగా వచ్చి అమ్మవారి కి బోనాలు సమర్పించి అమ్మవారికి పసుపు కుంకుమ లతో పూజలు నిర్వహించారు. అమ్మవారి దయతో ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురవాలని పాడిపంట కాపాడాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమాన్ని రావుల బ్రహ్మయ్య, నాయుడు ఆంజనేయులు, నాగార్జున, మధు, సురేష్, గోపి, తోపాటు ఆయా గ్రామాల గ్రామ అభివృద్ది కమిటీలు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.