– నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు
నవతెలంగాణ – కంటేశ్వర్
ఎమ్మెల్సీగా మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులుగా మహమ్మద్ అలీ షబ్బీర్ నియమితులైన తర్వాత మొదటిసారి నిజామాబాద్ కు వస్తున్న సందర్భంగా, 16వ తేదీ నాడు నిర్వహించే స్వాగత ర్యాలీ అభినందన సభ ఉంటుందని, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేశ వేణు తెలిపారు. ఈ మేరకు బుధవారం కాంగ్రెస్ భవన్ నందు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవేణు, పిసిసి ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హందన్ విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పిసిసి ఉపాధ్యక్షులు తాహిర్బిన్ హమ్దాన్ మాట్లాడుతూ పార్టీ కోసం ప్రజల కోసం ఎల్లప్పుడూ కష్టపడుతున్న మహేష్ కుమార్ గౌడ్ మహమ్మద్ అలీ షబ్బీర్ కి పార్టీ అధిష్టానం మర్చిపోకుండా వారికి ముఖ్యమైన పదవులు ఇవ్వడం సంతోషకరంగా ఉందని, దీనికి సహకరించిన జాతీయ కాంగ్రెస్ నాయకులకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. వారు ఇద్దరూ ఈ నెల 16వ తేదీన మొదటిసారి బాధ్యతలు తీసుకున్న తర్వాత నిజామాబాద్ కు వస్తున్న సందర్భంగా వారికి ఘన స్వాగత ర్యాలీ అభినందన సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని, దీనికి ముఖ్య అతిథులుగా బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి , ఆయనతోపాటు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు పాల్గొంటున్నారని ఆయన తెలియజేశారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎల్లప్పుడూ ప్రజల కోసమే పని చేస్తుందని గత పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ చేసిన పాపాలను అప్పులను రేవంత్ రెడ్డి అంతఃకరణ శుద్ధితో బయటపెడుతున్నారని ఆయన అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఆరు గారంటీలను అమలు చేసే దిశగా పనిచేస్తుందని ఆయన అన్నారు.ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకులైన మహేష్ కుమార్ గౌడ్ కి మొహమ్మద్ అలీ షబ్బీర్ కి కీలకమైన పదవులు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున కి, అగ్ర నాయకురాలు సోనియా గాంధీ కి ,రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడే పని చేసిన వారికి గుర్తింపు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అదే విధంగా ఎమ్మెల్సీగా ఎన్నుకోబడిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులుగా నియమింపబడిన తర్వాత మహమ్మద్ అలీ షబ్బీర్ మొదటిసారి నిజామాబాద్ కు వస్తున్న సందర్భంగా బోర్గమ్ బ్రిడ్జి నుండి వారికి ఘన స్వాగతా ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని ,ర్యాలీ అనంతరం ప్రగతి నగర్ లోని మున్నూరు కాపు సంఘంలో అభినందన సభ నిర్వహించి వారి ఇద్దరినీ సన్మానించడం జరుగుతుందని కేశ వేణు తెలియజేశారు .స్వాగత ర్యాలీ బోర్గం బ్రిడ్జి వద్ద 16వ తేదీన మధ్యాహ్నం ఒకటి గంటలకు ప్రారంభమై పులాంగ్ మీదుగా గోల్ హనుమాన్ – ఆర్య సమాజ్ – బడా బజార్ – ఆజం రోడ్ – నెహ్రూ పార్క్ – బస్టాండ్ – తిలక్ గార్డెన్ – ఎల్లమ్మ గుట్ట చౌరస్తా మీదుగా ప్రగతి నగర్ లోని మున్నూరు కాపు కళ్యాణ మండపం చేరుకుంటుందని, అనంతరం మున్నూరు కాపు కళ్యాణ మండపంలో అభినందన సభ తో పాటు సన్మాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ సభ్యులు జావిద్ అక్రమ్, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దయాకర్ గౌడ్, రాంభూపాల్, అంతిరెడ్డి విజయపాల్ రెడ్డి, సిరికొండ గంగారెడ్డి ,మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.