నవతెలంగాణ రెంజల్: మండలంలోని దూపల్లి, రెంజల్, సాటాపూర్ గ్రామాలలో హోలీ పండుగను పురస్కరించుకొని కుస్తీ పోటీలను నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహణ జరిగింది. గెలుపొందిన విజేతలకు 2000 రూపాయల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు లింగన్న యాదవ్, తాజా మాజీ సర్పంచులు ఎమ్మెస్ రమేష్ కుమార్, శనిగరం సాయి రెడ్డి, బాబన్న, పిట్ల భూమేష్, జాడి సాయి లు, ఉప సర్పంచ్ సాయిలు, జబ్బార్, తదితరులు పాల్గొన్నారు.