నవతెలంగాణ – నసురుల్లాబాద్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా బీర్కూర్, నసురుల్లాబాద్ మండలాల్లో యోగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నసురుల్లాబాద్ మండలంలోని అంకుల్ తండా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కొన్ని యోగాసనాలలో ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రు యువజన సంఘం కన్వీనర్ సునీల్ రాథోడ్ మాట్లాడుతూ యోగా , మనిషి ఆరోగ్యానికి ఎంతైనా అవసరమని చెప్పారు. భారత ప్రభుత్వం ప్రతి పాఠశాలలో ఒక యోగ తరగతి ను ఏర్పాటు చేసి ఒక యోగ టీచర్ ను కూడా నియమించలని, అందరికి యోగ వచ్చేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బల్ రాజ్, సునీల్ రాథోడ్ లక్ష్మయ్య, శ్రీచంద్, రమేష్, మహేష్, గోదావరి, ఆర్నాపూర్ణ, ఖాతిజ, శంరావ్, రవి తదితరులు పాల్గొన్నారు.