మండలంలోని కాటేపల్లి గ్రామంలో కాటేపల్లి ప్రీమియర్ లీగ్ “ఆధ్వర్యంలో సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు.12 రోజులు జరిగిన ఈ టోర్నమెంట్ లో వివిధ గ్రామాల నుండి 52 జట్టులు పాల్గొన్నాయి. ఈ పోటీలలో సంగోజీపేట్ గ్రామానికి చెందిన జట్టు మొదటి స్థానం లో నిలిచింది.వీరికి 22వేల222 రూపాయలు ప్రైజ్ మనీ ,కప్ ను నిర్వాహకులు అందజేశారు.అలాగే కాటేపల్లి గ్రామానికి చెందిన జట్టు రెండవ స్థానంలో నిలిచింది.ఈ జట్టుకు ద్వితీయ బహుమతి గా 11వేల 111రూపాయలు ప్రైజ్ మనీ,కప్ ను నిర్వాహకులు అందజేశారు. ఈ టోర్నమెంట్ లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా బర్ధావల్ కిషన్ నిలిచారు.ఈయనకు నిర్వాహకులు కప్ ను అందించి అభినందించారు. కాటేపల్లి ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నమెంట్ కు కాటే పల్లి గ్రామస్తులు పెద్ద యెత్తున సహకరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,యువకులు,విద్యార్దులు పాల్గొన్నారు.