ఘనంగా పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం..

A spirited gathering of former students.నవతెలంగాణ – డిచ్ పల్లి
నగరంలోని శ్రీ విశ్వశాంతి హైస్కూల్ లో 2001-2002 సంవత్సరం లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఆదివారం డిచ్ పల్లి మండలం లోని బర్ధిపూర్ శివారులోని  హోటల్ కృష్ణ లో ఘనంగా నిర్వహించారు. 22 సంవత్సరాల తరువాత విద్యార్థులు ఒకే వేదికపైకి రావడం తో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. కుటుంబ సభ్యుల వివరాలు, ఉద్యోగం, వ్యాపార విషయాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నప్పుడు తరగతి గదుల్లో చేసిన అల్లరి, చిలిపి చేష్టలను గుర్తుచేసుకుంటూ  రోజంతా ఉల్లాసంగా గడిపారు. అంతకుముందు పాఠశాల కరస్పాండెంట్ ప్రభాకర్, తోటి విద్యార్థుల మృతికి నివాళుల ర్పించారు. అనంతరం విద్యా బుద్ధులు నేర్పించిన గురువులు, పాఠశాల కరస్పాండెంట్ రోజారాణిని శాలువా, మెమోంటో సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్ధులు అమ్రిష్, వనమాల భాస్కర్, ఫణిరాజ్, శ్రీకాంత్ రెడ్డి, రాంచందర్ రెడ్డి, రాజ్ కుమార్, అనిల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.