నవతెలంగాణ – ధర్మసాగర్
మండల కేంద్రంలోని బాలికల పాఠశాలలో 1998-99 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ హెచ్ఎం జనార్దన్ స్వామి, టీచర్ కృష్ణవేణి, పిఈటి టీచర్ వజ్ర పాల్గొని మాట్లాడారు. విద్యార్థి జీవితం తిరిగినరానటువంటిదని, ఈరోజు 25 సంవత్సరాల తర్వాత గత స్మృతులను స్మరించుకొనుటకు ఏర్పాటుచేసి ఆత్మీయ సమ్మేళనం చాలా సంతృప్తికరంగా ఉందన్నారు. విద్యను ఆ రోజులలో సక్రమంగా అందించాలంటే కనీస మౌలిక వసతులు లేకుండా ఉండేవని గుర్తు చేశారు. అందుకు విరుద్ధంగా ఈ రోజులలో విద్యను ప్రతి ఒక్కరు కొనుక్కోవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజులలో గురువులను దైవంగా భావించే వారిని, నేటితరం విద్య సంస్థలను, గురువులను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్న తీర్లను గుర్తు చేస్తూ బాధపడ్డారు. ఏదిఏమైనాప్పటికీ ఆ రోజులే బాగుండేవని పూర్వ విద్యార్థులు తమ తమ అభిప్రాయాలను వెల్లుబుచ్చారు.గతంలో వారు చేసిన తీపి జ్ఞాపకాలను ఈ సందర్భంగా నెమరు వేసుకున్నారు. అనంతరం గురువులను శాలువాలకు మెమొంట్లతో పుష్పగుచ్చాలతో సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పుట్ట శ్రీలత, మూడిక సంధ్య, భార్గవి, కవిత, జ్యోతిలక్ష్మి,స్వప్న, ఎండి ఫెరోజ్, జి శ్రీలత, రజిని, స్వరూప తదితరులు పాల్గొన్నారు.