తుర్కపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2011 -12 సంవత్సరంలో చదివిన 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం మండల కేంద్రంలోని జెఎం ఫంక్షన్ హాల్ లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాము చదువుకున్న రోజుల నాటి, ప్రస్తుత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తమకు విద్య నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ,పూర్వ విద్యార్థులు దేవి పూర్ణిమ సంధ్యారాణి, ప్రియాంక, కవిత, రష్మిత, కళ్యాణి ,సుమలత, భాగ్య, జ్యోతి ,విజయ, మౌనిక, వనిత, సాయిని, వినోద్ చారి, అనిల్ ,ప్రవీణ్, భాస్కర్ ,వినోద్, మహేందర్, మధు, దేవేందర్, శివశంకర్, రాకేష్, బాబు, శేఖర్, దిలీప్ ,సాదిక్ ,పవన్ పాల్గొన్నారు.