ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎల్బాక గ్రామంలో ఆదివారం షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రోజు లానే కళ్ళు తీసేందుకు తాడిచెట్టు ఎక్కిన గీత కార్మికుడు మడ్డి నర్సయ్య పెను ప్రమాదంలో చిక్కుకున్నాడు. చెట్టు ఎక్కి దిగుతున్న క్రమంలో చెట్టు పైన “మోకు, టైరు” తెగి ఇబ్బంది పడ్డాడు. ఒక గంట చెట్టు పైననే నరకయాతన అనుభవించాడు. ప్రమాదంలో చిక్కుకున్న నరసయ్య గౌడ్ ను, సహచర మిత్రుడు అదే గ్రామానికి చెందిన గీత కార్మికుడు గంధమాల శ్రీను, చెట్టు పైకెక్కి “మోకు”కుడిపోయిన మళ్లీ పునరుద్ధరించి కాపాడాడు. గీత కార్మికుడు నర్సయ్య గౌడ్ ను జాగ్రత్తగా కిందికి దింపాడు. దీంతో ఆయనకు పెను ప్రమాదం తప్పింది. గీత కార్మికుడు నరసయ్య కు ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం నుండి ధైర్య సాహసాలతో చెట్టు ఎక్కి మోకు అందించి కాపాడిన గంధమాల శీను సాహసానికి, గీత కార్మికులు గ్రామస్తులు గ్రామ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు.