
రెంజల్ మండలం బాగేపల్లి గ్రామం ప్రైమరీ పాఠశాలలో గత 12 సంవత్సరాలుగా విద్యార్థులకు విద్య బోధించిన ఉపాధ్యాయుడు సురేష్, దూపల్లి ప్రైమరీ పాఠశాలకు బదిలీపై వెళ్లడంతో, గ్రామ పెద్దలు ఆయనకు శాలువాలు కప్పి పూలమాలతో ఘనంగా సన్మానం జరిపారు. గత 12 సంవత్సరాలుగా తమ గ్రామంలో చిన్నారులకు విద్యను బోధించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దినందుకుగాను గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నరేందర్ శేఖర్, తాజా మాజీ సర్పంచ్ పాముల సాయిలు, మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ సుదర్శన్, ఆలయ కమిటీ అధ్యక్షులు సాయ గౌడ్, కార్యదర్శి చింతల గోపాల్, ఆటో సాయిలు, సుభాష్ గౌడ్, విట్టల్, అంగన్వాడి టీచర్ సరోజా తదితరులు పాల్గొన్నారు.