జన్నారం మండలంలోని జయరాణి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో, యూకేజి నుంచి ఆరవ తరగతి వరకు చదివిన మండలంలోని పెర్కపల్లి గ్రామానికి చెందిన చుంచు ప్రవళిక, ఏఈఈ ఉద్యోగం సాధించినందుకు గాను శుక్రవారం ఆ పాఠశాల ప్రిన్సిపల్ మధుసూదన్ ఆమెను శాలువాతో సత్కరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నతనం నుంచి విద్యార్థులు క్రమశిక్షణతో చదివితేనే ఉన్నత శిఖరాలలో ఉంటారన్నారు. ప్రవళిక నాగపూర్ ఎన్ఐటి లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి టీఎస్పీఎస్సీ ద్వారా పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగం సాధించారు. సందర్భంగా ఆ పాఠశాల ఉపాధ్యాయులు పలువురు ఆ విద్యార్థిని అభినందించారు. పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.