
మండలంలో కొయ్యుర్ గ్రామంలో గత 8 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్యనందిస్తున్న విశ్వదీప్తి పాఠశాల కరస్పాండెంట్ ఎంకె సూదర్శనన్ దంపతుల ఆధ్వర్యంలో ఇటీవల పాఠశాల 8వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన మండల పాత్రికేయులు చింతల కుమార్ యాదవ్,చొప్పరి రాజయ్య,రాగం కుమార్ లను శాలువా, మెమోంటో లతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముందుగా పాఠశాలలో చదువుతున్న చిన్నారులతో బొకేలు అందజేసి పాత్రికేయులకు ఘన స్వాగతం పలికారు. 8 ఏళ్లుగా పాఠశాలను కొనసాగిస్తూ ఎంతోమంది విద్యార్థులను ప్రోత్సహిస్తున్న పాఠశాల కరస్పాండెంట్ సుదర్శనన్ దంపతులను పాత్రికేయులు అభినందించి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.