
మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించబడిన ముప్ప గంగారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ హోదాలో తొలిసారి మండల పరిషత్ కార్యాలయానికి రావడం సందర్భంగా మండల అధికారులు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధికారులు ఆయన దృష్టికి మండల పరిషత్ కి సొంత భవనం కావాలని ఆయనకు వివరించడం జరిగింది. కచ్చితంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరలో మన మండలంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వ భవనాలు ఏర్పాటు చేసే విధంగా చూస్తామని ఆయన వారికి తెలియజేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాములు నాయక్ ఎంపీఓ కిరణ్ కుమార్ ,సూపర్డెంట్ ప్రదీప్, భోజన్న తదితరులు పాల్గొన్నారు.