బదిలీపై వెళ్తున్న ఎంపీడీవోకు ఘన సన్మానం..

నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి గా వీధుల నిర్వహించి ఎన్నికల బదిలీల్లో భాగంగా కామరెడ్డి కి వెళ్తున్న టీవీఎస్ గోపి బాబును సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గద్దె భూమన్న, తాజా మాజీ సర్పంచ్లు, కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో టీవీఎస్ గోపి బాబు మాట్లాడుతూ.. గత 19 నెలల క్రితం ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు తోటి సిబ్బంది గ్రామాల, మండల అభివృద్ధికి తనకు సహాయ సహకారాలు అందజేశారని, అది ఎన్నటికీ మరిచిపోలేనని టివిఎస్ గోపిబాబు అన్నారు. ఎక్కడ వీధులు నిర్వహించిన మండలానికి మాత్రం మర్చిపోలేనని వివరించారు. కార్యాలయ సిబ్బంది మాట్లాడుతూ..ఎంపీడీవోగా టీవీఎస్ గోపి బాబు వీధిలో చేరిన నాటి నుండి నేటి వరకు అందరితో కలిసి మెలిసి ఉంటూ మండలాన్ని అభివృద్ధికి చేయించారని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత మళ్లీ తిరిగి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా వస్తారనే అశాభావం వ్యక్తం చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఎంపీఓ శ్రీనివాస్ గౌడ్, సూపరింటెండెంట్ నివేదిత,కార్యదర్శిలు కిషన్ రావు, కవిత, ఏపిఎం నాగరాజ్,ఎపిఓ సుదకర్ తో పాటు పంచాయతీ కార్యదర్శులు, కార్యలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.