మండలం కేంద్రమైన తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం చైర్మన్ ఇప్ప మొండయ్య ఇటీవల బాధ్యతలు చేపట్టి తొలిసారిగా ఆన్ సాన్ పల్లి గ్రామానికి విచ్చేసిన సందర్భంగా గ్రామ తాజా మాజీ సర్పంచ్ గుగులోత్ జగన్ నాయక్ ఆధ్వర్యంలో చైర్మన్ కు మంగళవారం బొకే అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి దూలం సులోచన,స్పెషల్ అధికారి హరిత,పంచాయతీ కార్యదర్శి వెన్నెల,కారొబార్ శ్రీకాంత్ పాల్గొన్నారు.