ప్రధాని మన్ననలు పొందిన చిన్నారి కళాకారులకు ఘన సత్కారం..

A big honor for the child artists who received the pardon of the Prime Minister..– బీసీ సాధికారిక సంఘం ఆధ్వర్యంలో ఓగ్గు, డోలు చిన్నారి కళాకారులకు సన్మానం..
నవతెలంగాణ – వేములవాడ
డిల్లీలో వీర్ బాల్ దివాస్ ద్వార 2024 సంవత్సరములో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో శరత్ సుంకరి బోనాల కోలాటం శిక్షకులు, పెరల్స్ ఆర్ట్స్ క్రియేషన్స్ వ్యవస్థాపకులు ఆధ్వర్యంలో మన తెలంగాణ మట్టి కళారూపం, ఒగ్గుడోలు, బోన విన్యాసం కార్యక్రమాలను డిల్లీలో ప్రదర్శించి ప్రధాని నరేంద్ర మోడీ మన్ననలను పొందడం అభినందనీయమని రాష్ట్ర బీసీ సాధికారిత సంఘం గౌరవ అధ్యక్షులు కొండ దేవయ్య అన్నారు. సోమవారం వేములవాడ పట్టణంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో చిన్నారిి కళాకారుులను అభినందించి సన్మానించారు. కొండ దేవయ్య మాట్లాడుతూ మన తెలంగాణ గౌరవాన్ని చాటిచెప్పిన కళాకారుల బృందానికి వేములవాడ బీసీ సాధికారిత సంఘం పక్షాన సంఘ భవనంలో ఘనంగా ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది అని అన్నారు.డిల్లీలో ప్రదర్శనలు ఇచ్చి ప్రధాని మన్ననలను పొందిన కళాకారులను సన్మానించి వారిని అభినందించారు. కళాకారుల కార్యక్రమాల నిర్వహణ కోసం,కలల అభివృద్ధి కోసం తనవంతు సహాయ, సహకారాన్ని అందిస్తానన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికారిత సంఘం కన్వీనర్ పొలాస నరేందర్ మాట్లాడుతూ.. కళాకారులకు సహాకారం లేక రోజు,రోజుకు కలలు అంతరించిపోతున్న కళలకు, కళాకారులకు పూర్వ వైభవం రావాలంటే ప్రభుత్వం కళాకారుల సంక్షేమం కొరకు అధికంగా నిధులు కేటాయించాలని అన్నారు. కార్యక్రమంలో బీసీ సాధికారిత సంఘం జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ గాజుల బాలయ్య, పట్టణ అధ్యక్షులు తూపుకారి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి ఇల్లందుల వెంకటేష్, పిన్నింటీ హన్మాండ్లు,మహ్మద్ సంధానీ,  కుంభం రవీందర్ , చేను హెలపాతి ,మంతెన దుర్జెష్, బుర్గుపెళ్లి రామస్వామి, కంసానీ శ్రీధర్,లక్ష్మి నారాయణ లతో పాటుగా ,సన్మాన గ్రహీతలు చిన్నారులు దీకొండ రాజశేఖర్,ధీకొండ విష్ణువర్ధన్, దీకొండా అంజిత్ కుమార్, దీ కొండ రితిక, ధీకొండ హర్షవర్ధన్, ధీకొండ సిద్ధార్థ పబ్బల అక్షిత్ కుమార్,దయ్యాల అభిరామ్,దయ్యాల మధు, ధీకొండ రాజమల్లు తో పాటు తదితరులు పాల్గొన్నారు.