నిజామాబాద్ జిల్లా నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శిగా ఎంపికైన బీరేందర్ సింగ్ ను రెంజల్ మండల పరిషత్ కార్యాలయం అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానం జరిపారు. రెంజల్ మండల పరిషత్ ఆఫీస్ సబార్డునెంటుగా పనిచేస్తున్న బీరేందర్ సింగ్ జిల్లా కార్యదర్శిగా ఎంపిక కావడం తమ కార్యాలయానికే గర్వకారణమని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో వెంకటేష్ జాదవ్, మండల పాలన అధికారి హెచ్. శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ అన్వర్ హైమద్, వినాయక్, శివ ప్రసాద్, దేవి సింగ్, తదితరులు పాల్గొన్నారు.