ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు ఘన సన్మానం

A great honor for the MLA under the aegis of MMRPSనవతెలంగాణ – మద్నూర్ 
మద్నూర్ మండల ఎంఆర్పిఎస్ నాయకుల ఆధ్వర్యంలో జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావుకు శుక్రవారం నాడు మద్నూర్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ అమలు కోసం మీ కృషి అమూల్యమైనవని వారు పేర్కొన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గంగారం ఎమ్మార్పీఎస్ నాయకులు విజయ్ మారుతి, భీంరావ్,యాదురావ్,సురేష్, గంగారాం, తదితరులు పాల్గొన్నారు.