నూతన మున్సిపల్ చైర్మన్ , వైస్ చైర్మన్ కు ఘన సన్మానం

– సన్మానించిన ఏకే ఫౌండేషన్ చైర్మన్ కట్టెబోయిన అనిల్ కుమార్
నవతెలంగాణ -పెద్దవూర
నల్గొండ జిల్లా హలియా మున్సిపాలిటీ నూతనంగా ఎన్నుకోబడిన చైర్మన్ ఎడవల్లి అనుపమ నరేందర్ రెడ్డి,వైస్ చైర్మన్ పిల్లి చంద్రకళ ఆంజనేయులు ఏకే పౌండేషన్  చైర్మన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కట్టెబోయిన అనిల్ కుమార్ ఆదివారం ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం జిల్లా ఉపాధ్యాయులు తుమ్మరగోటి రమేష్, యూత్ నాయకులు మన్నెం కోటి, రావుల రాము, యాదవ్, మేకల శివ యాదవ్, శేఖర్ గౌడ్, రావుల  రాంబాబు యాదవ్, మోకారాల అంజి, సాయి, తదితరులు పాల్గొన్నారు.