
డిచ్ పల్లి మండలంలోని ధర్మారం బి సాంఘిక సంక్షేమ పాఠశాలలో మంగళవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈనెల 13 నుండి 17 వరకు తైవాన్ దేశంలో తైపి లో జరిగిన ఏషియన్ సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలలో భారత జట్టు తరఫున జిల్లా క్రీడాకారులు ఎస్. సౌమ్యరాణి (కెప్టెన్) (సాంఘిక సంక్షేమ కళాశాల తాడ్వాయి), జి. సౌందర్య (సాంఘిక సంక్షేమ పాఠశాల సుద్దపల్లి), జి.సాత్విక ((సాంఘిక సంక్షేమ పాఠశాల సుద్దపల్లి), జి.శ్రావిక (సాంఘిక సంక్షేమ పాఠశాల సుద్దపల్లి), డి. సరియు( సాంఘిక సంక్షేమ కళాశాల ధర్మారం) లు పాల్గొని తిరిగి వచ్చిన సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాంఘిక సంక్షేమ పాఠశాలల ప్రాంతీయ అధికారిని మేరీ ఏసు పాదం పాల్గొని క్రీడాకారులను ఘనంగా సన్మానించి క్రీడాకారునిదేశించి మాట్లాడుతూ భారత జట్టును సాంఘిక సంక్షేమ వివిధ పాఠశాలల క్రీడాకారులు అంతర్జాతీయ పోటీల్లో రాణించడం అభినందనీయమన్నారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్య సాధన కోసం కృషి చేయాలన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు వి ప్రభాకర్ రెడ్డి పాల్గొని క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ..భారత జట్టులో జిల్లా క్రీడాకారులు ఐదుగురు పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ భారత జట్టుకు ఎస్ సౌమ్యరాణి భారత జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తూనే ఏషియన్ ఉత్తమ సాఫ్ట్ బాల్ క్రీడాకారిణిగా ప్రత్యేక బహుమతిని అందుకోవడం గర్వించదగ్గ విషయం, భవిష్యత్తులో మరింత మంది క్రీడాకారులని అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి బొజ్జ మల్లేష్ గౌడ్, జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగా మోహన్, ఉపాధ్యక్షులు జైపాల్ రెడ్డి, సాంఘిక సంక్షేమ పాఠశాలల జిల్లా అధికారిని సంగీత ,స్పోర్ట్స్ కోఆర్డినేటర్ నీరజ రెడ్డి , సుద్ధపల్లి పాఠశాల ప్రిన్సిపల్ గోదావరి, తాడ్వాయి పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీబాయి, వ్యాయామ ఉపాధ్యాయులు నల్లూరి లత, జోష్ణ, సంధ్య, సాఫ్ట్ బాల్ అకాడమీ కోచ్ వేముల మౌనిక తదితరులు పాల్గొన్నారు.