పదవీకాలం పూర్తి అయిన సర్పంచులకు ఘన సన్మానం

– ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు ఆధ్వర్యంలో శాలువాతో ఘన సత్కారం

– ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు
నవతెలంగాణ-నెల్లికుదురు : ఇటీవల గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీకాలం ముగియడంతో ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ గ్రామాల సర్పంచులకు గురువారం ఆయా గ్రామాల ఎంపీటీసీలు తో కలిసి పదవి విరమణ ముగిసిన సర్పంచులకు ఘనంగా సత్కరించి మెమొంటో అందించినట్లు ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు ఎంపీడీవో శేషాద్రి తెలిపారు ఈ సందర్భంగా ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు మాట్లాడుతూ మొదటగా సర్పంచుల రాష్ట్ర గుర్తు చేసుకుంటూ మాట్లాడారు గ్రామాలలో గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా సర్పంచులు పాటు పడ్డారని అన్నారు గత ప్రభుత్వం ఏ కార్యక్రమాలు గ్రామ అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన వెనకడుగు వేయకుండా ఆర్థికంగా నష్టపోయినప్పటికీ కూడా గ్రామంలో నిర్వహించే ప్రతి పథకంలో ముందుండి గ్రామాభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన వ్యక్తులు ఈ సర్పంచులు అని అన్నారు గతంలో ఎంతో మంది సర్పంచులు వచ్చారు పోయారు కానీ ఈ సర్పంచ్  హాయంలో గత ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ఎన్ని రంగాలుగా కార్యక్రమాల నిర్వహించాలన్నప్పటికీ ఎంతో కృషి చేసి మండలంలోని వివిధ గ్రామాలను అభివృద్ధి పరిచారని అట్టి సర్పంచ్లను ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి వారికి మెమొంటులను అందిస్తున్నట్లు తెలిపారు మండలాన్ని అభివృద్ధి పరచడంలో మీరు ముందుండినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా మన ఎంపీడీవో శేషాద్రి కి ఉత్తమ ఎంపీడీవో అవార్డు కూడా రావడం సంతోషంగా ఉందని అన్నారు అంతే కాకుండా మన మండలంలో కొన్ని గ్రామపంచాయతీలను ఉత్తమ గ్రామ పంచాయతీలుగా అవార్డులు తీసుకొని కృషి చేసిన వ్యక్తులను ప్రజలు మర్చిపోరని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు పెరుమాండ్ల గుట్టయ్య వేన్నాకుల వాణి ఆదురి సుభాషిని కలదర్ రాజ్ బత్తిని అనిల్ గౌడ్ మండల కో ఆప్షన్ సభ్యుడు ఎండి రహిమాన్. వివిధ గ్రామాల సర్పంచులు బీరవెల్లి యాదగిరి రెడ్డి పరుపాటి రుక్మిణి వెంకటరెడ్డి డోనికన జ్యోతి కాలేరు శ్రీ వేణి చిరా లక్ష్మి కైలా గాయపు జైపాల్ రెడ్డి మాంగ్య నాయక్ రాజు పరమేష్ నరేష్ పంచాయితీ మండల అధికారి పార్థసారథి పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.