ఎన్డీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ కు ఘన సన్మానం..

A great honor to the Vice Chairman of NDCC Bank..నవతెలంగాణ – మోపాల్ 

మోపాల్ మండలంలోని బోర్గం పి సొసైటీలో బుధవారం రోజున సొసైటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి ఎన్డీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ అయిన సందర్భంగా డైరెక్టర్లు మరియు తమ సొసైటీ పరిధిలోని గ్రామాల రైతులు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల మాజీ ఉపాధ్యక్షుడు సాయికుమార్ మాట్లాడుతూ.. ఈరోజు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని  అన్ని సొసైటీలలో కెల్లా బోర్గం సొసైటీ అభివృద్ధి బాటలో నడుస్తుందంటే కేవలం చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి వల్లనే అని రైతులకు కావాల్సిన ఫర్టిలైజర్  విషయంలో ఏ లోటు రాకుండా రైతులకు అందుబాటులో ఉండే విధంగా చూస్తాడానీ, సొసైటీ లావాదేవీ లో కూడా నిక్కచ్చిగా ఉంటాడని, అటువంటి మచ్చలేని నాయకుడు అని ఇటువంటి చైర్మన్ మా సొసైటీ ఉండడం మా రైతులందరూ అదృష్టమని ఆయన కొనీయడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భూషణ్, సాయినాథ్ తదితర నాయకులు పాల్గొన్నారు.